You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుమల: 116 ఏళ్ల వృద్ధురాలికి వీఐపీ దర్శనం
116 ఏళ్ల వృద్ధురాలు తిరుమలకు కాలినడకన వస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. చాలామంది ఆ వృద్ధురాలికి తిరుమలలో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని కోరారు.
దీనిపై స్పందించిన టీటీడీ చైర్మన్ ఆ వృద్ధురాలి వివరాలు కావాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆమె పేరు నవనీతమ్మ అని, తమిళనాడుకు చెందిన ఆమె తిరుపతిలోని జీవకోనలో తన బంధువుల ఇంట్లో ఉంటోందని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వివరాలు సేకరించారు.
కాలినడకన వచ్చి దర్శనం చేసుకున్న నవనీతమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా మరోసారి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు.