BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
వెనెజ్వెలాలో భారీ భూకంపం, వేల మంది చనిపోయి ఉండొచ్చని యూఎస్జీఎస్ అంచనా
వెనెజ్వెలా రాజధాని కారకాస్‌లో భారీ భూకంపం సంభవించింది. సెకన్ల వ్యవధిలోనే రెండుసార్లు భారీ భూప్రకంపనలు వచ్చాయి. మొదటిసారి ప్రకంపనలు 7.2 తీవ్రతతో రాగా, రెండోసారి 7.5గా నమోదైంది.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌పై 'భూ కుంభకోణం' ఆరోపణలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య 'పొలిటికల్ హీట్'
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఆయన కుటుంబం ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలో 168 ఎకరాల భూమి కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, ఇది కుట్ర అని బీజేపీ విమర్శించింది.
బలూచిస్తాన్ మహిళా ఉద్యమకారిణికి జీవిత ఖైదు విధించిన పాక్ ప్రభుత్వం... అసలేం జరిగింది?
బీబీసీ 100 విమెన్-2024 జాబితాలో చోటు దక్కించుకున్న మహరంగ్ బలూచ్ 2009లో తన తండ్రిని భద్రతా సిబ్బంది ఎత్తుకెళ్లారని, రెండేళ్ల తర్వాత చిత్రహింసల ఆనవాళ్లతో ఆయన మృతదేహం లభించిందని ఆరోపించారు.
‘మా నాన్న సమాధిని తవ్వి బంగారపు గొలుసు ఎత్తుకెళ్లి పంచుకున్నది మాకు బాగా తెలిసినవాళ్లే’
‘‘ మేం నాగరాజ్ మృతదేహాన్ని ఆరు అడుగుల పొడవు, నడుము లోతు గుంతలో ఖననం చేశాం. కానీ వారు అర్ధరాత్రి కేవలం చేతులతో తల భాగాన్ని తవ్వి ఆయన మెడలోని బంగారు గొలుసును తీసుకువెళ్లారు''
ఇరాన్ అమెరికా ఒప్పందం తర్వాత నెతన్యాహును ‘వర్రీ’కి గురిచేసే ఐదు అంశాలివే..
ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేసిన దేశానికి అందనున్న 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నెతన్యాహుకు ఏమాత్రం శుభవార్త కాదు.
‘ఓ 10 ఏనుగులు వచ్చి ఇంటిముందు నిలబడ్డాయి, రాత్రంతా ఇంట్లోనే గడిపాం’
జనావాసాల్లోకి వచ్చే ఏనుగుల్ని తరిమి కొట్టే బాధ్యతను అటవీ శాఖ బృందాలకు అప్పగించారు. రేంజర్ల సూచనల మేరకు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు వెళతాయి.
పాలస్తీనా చిన్నారులు లక్ష్యంగా ఇజ్రాయెల్ జాతిహననానికి పాల్పడుతోంది: ఐరాస కమిషన్
ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ పాలస్తీనా పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని, ఫలితంగా జాతిహననం, మానవాళి వ్యతిరేక నేరాలు, యుద్ధ నేరాలు జరిగాయని తేలింది. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
కాబోయే భర్తను కోటపై నుంచి తోసేసి చంపేశారన్న ఆరోపణలతో యువతి, ఆమె ప్రియుడు అరెస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..
కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌తో కలిసి లోహగడ్‌కు వెళ్లానని, అక్కడ ప్రమాదవశాత్తూ జారిపడి కేతన్ అగర్వాల్ చనిపోయారని సియా గోయల్ పోలీసులకు చెప్పారు. కానీ, విచారణలో ఆ యువతి ప్రియుడి గురించి బయడపడింది. ఆ తర్వాత..
ఇరాన్ చమురు విషయంలో, అమెరికా రాయితీతో భారత్‌కు లాభమా?
భారత్ ముడి చమురులో 45 శాతం, ఎల్ఎన్జీలో 50 శాతం ఎల్పీజీ దిగుమతులలో 90 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే వచ్చేవి. హార్ముజ్ మూసివేతతో పరిస్థితులు మారిపోయాయి. అయితే, ఇప్పుడు ఇరాన్ ఆయిల్ విషయంలో అమెరికా ఇచ్చిన మినహాయింపుల ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































