జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...

సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం.. జంతర మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది.

కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మూడో విడత జరిగిన చర్చల అనంతరం, కేంద్ర మంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తమ మిగిలిన డిమాండ్లను అంగీకరించిందని వారు చెప్పారు.

దీక్ష ముగిసిందని, అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని తమ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.

సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వీధుల్లో మిన్నంటిన యువత సంబరాలు
సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, ఇతర విద్యార్థులతో కలిసి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే‌‌ వేదికపై సంబరాలు
సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమర్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ గత కొన్ని రోజులుగా వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు.
సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత డప్పు వాయించి తన ఆనందాన్ని వ్యక్తం చేసిన యువతి. నిరసన చేపట్టిన యువత ప్రధాన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన రాజీనామా ఒకటి.
సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, ‘‘కాక్రోచెస్ గెలిచారు, డెమొక్రసీ గెలిచింది’’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీజేపీ పోస్ట్ చేసింది.
సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్ద యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
సీజేపీ మద్దతుదారులు, సీజేపీ, నిరసన, దిల్లీ, సోనమ్ వాంగ్ చుక్
ఫొటో క్యాప్షన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అభివర్ణించారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)