BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి? దీనిని రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
"ఈ ద్వీపంలో నివసిస్తున్న వారంతా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వారిని సంప్రదించలేదు. తాము కోల్పోయే భూమికి ఎంత పరిహారం అందుతుందో కూడా వారికి తెలియదు. నేను ఇక్కడకు రావడానికి ప్రభుత్వం ఎందుకు ఇష్టపడలేదో, నేను ఇక్కడకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎందుకింత పెద్ద ప్రయత్నం చేసిందో నాకు ఇప్పుడు అర్థమైంది" అని రాహుల్ అన్నారు.
దాదాపు అందరి ఫోన్లలో ఒకేసారి 'అలర్ట్' మెసేజ్ ఎందుకొచ్చింది? అసలు విషయమేంటి?
దేశంలో, దాదాపు అందరి సెల్ఫోన్లు ఒకేసారి హెచ్చరిక సందేశాల(వార్నింగ్ మెసేజ్)తో మోగడం కలకలం రేపింది. అసలు ఈ అలర్ట్ మెసేజ్‌లు ఏమిటి? ఎందుకొచ్చాయి?
ఇరాన్‌తో అమెరికా యుద్ధం ముగిసిందా? ట్రంప్ లేఖలో ఏముంది, 60 రోజుల నిబంధన ఏమిటి
ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా..? దీనిపై ట్రంప్ యంత్రాంగం వాదన ఏంటి? నిపుణుల అభ్యంతరాలేంటి?
‘ఏఐ’తో ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ, ఈ మోసం ఎలా బయటపడింది?
''ఆ ఆర్డర్ కాపీ చూడగానే, నాకు ఎందుకో అనుమానం వచ్చి కొద్ది రోజులు ఆగాను. తర్వాత అధికారులకు చూపిస్తే అది నకిలీదని చెప్పారు. అంతేకాదు మంత్రి పీఏగా శేషాద్రి అనే వ్యక్తి ఉన్నాడా లేదా కూడా మేం ఆరా తీశాము. మంత్రి సత్యకుమార్ దగ్గర శేషాద్రి పేరుతో పీఏగా ఎవరూ లేరని తెలిసింది. దాంతో గంగాద్రి, వేణు మమ్మల్ని మోసం చేశారని తెలిసింది" అని జయచంద్ర చెప్పారు.
ఈవీఎంలో ఏం ఉంది? పార్టీలకు, ప్రజలకు అంతుచిక్కని పశ్చిమబెంగాల్ ఎన్నికలు
రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి దశలో 93.19శాతం, రెండో దశలో 92.67శాతం జరిగినట్టు తెలిపింది. పోలింగ్ హింసతో తరచూ వివాదాల్లో ఉండే బెంగాల్లో ఈ సారి పరిస్థితి భిన్నంగా కనిపించింది. ఫలితాలపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నా 4వ తేదీ కోసం నిరీక్షిస్తున్నాయి.
తమిళనాడు: 'విజయ్ పార్టీ అధికారంలోకి రావచ్చన్న ఒక ఎగ్జిట్ పోల్ అంచనా'పై అక్కడి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?
యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో, తమిళనాడులో సినీ నటుడు విజయా పార్టీ టీవీకే మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అయితే, ఈ సంస్థ అంచనాలపై అక్కడి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? టీవీకే ఏమంది?
వీడియో, అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?, వ్యవధి 1,06
జనాభా లెక్కల సమయంలో అద్దె ఇంటి వివరాలు చెప్పాలా? లేక సొంతింటి వివరాలు చెప్పాలా?
తెలంగాణ: కవిత పార్టీ పేరు వారంలోపే ఎందుకు మారింది?
ముందుగా తమ పార్టీ పేరు 'తెలంగాణ రాష్ట్ర సేన' అని చెప్పడం, తరువాత అది 'తెలంగాణ రక్షణ సేన'గా మారడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ పార్టీ పేరు ఎందుకు మారింది? ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు?
హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?
''ఎలాంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో మెట్రో కారిడార్లు విస్తరించేందుకు వీలుంటుంది. అన్ని ఫేజ్‌ల పరంగా ఒకే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా, నిర్వహణ పరంగా మరింత సమర్థంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది'' అని మెట్రో మొదటి దశ స్వాధీనం అగ్రిమెంట్ పూర్తయ్యాక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































