సెల్లార్ గోడల్లో రూ. 87 కోట్ల బంగారు నిధి

వీడియో క్యాప్షన్, సెల్లార్ గోడల మధ్య రూ. 87 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, నాణేలు
సెల్లార్ గోడల్లో రూ. 87 కోట్ల బంగారు నిధి
ప్రచురణ

బెల్జియంలో ఓ ఇంటి పునరుద్ధరణ పనులలో కార్మికులకు ఊహించని నిధి దొరికింది. సెల్లార్ గోడల మధ్య దాచిన దాదాపు రూ. 87 కోట్లు విలువైన నిధిని వారు గుర్తించారు.

తూర్పు ఫ్లాండర్స్‌లోని ఆ భవనంలో కొద్దిరోజుల కిందట కొత్త డ్రైనేజీ పైపుల ఏర్పాటు కోసం కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా వారికి పెద్ద సంఖ్యలో బంగారు బిస్కెట్లు, బంగారు నాణేలు కనిపించాయని స్థానిక మీడియా తెలిపింది.

ఈ నిధి ఎవరికి సొంతమవుతుందనే అంశంపై ఇప్పుడు తీవ్ర ఆసక్తి మొదలైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)