పాకిస్తాన్ విమాన ప్రమాదం: ఐదుగురు సిబ్బంది కోసం కొనసాగుతున్న గాలింపు

పాకిస్తాన్, విమానం, ప్రమాదం, బోయింగ్, కరాచీ, షార్జా

ఫొటో సోర్స్, Pakistan Airports Authority/X

    • రచయిత, మాట్ స్పైవే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 2 నిమిషాలు

పాకిస్తాన్‌ తీరం దగ్గర కనిపించకుండా పోయిన బోయింగ్ 737 విమానం శకలాలు గుర్తించారు. అందులోని ఐదుగురు సిబ్బంది జాడ ఇంకా తెలియలేదని పాకిస్తాన్ విమానయాన శాఖ అధికారులు చెప్పారు.

మంగళవారం(జూలై 7)కరాచీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు బయలుదేరిన ప్రైవేట్ కార్గో విమానం అదృశ్యమయింది.

కనిపించకుండాపోయిన విమానం సిబ్బంది ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు. బోయింగ్ 737ను కే2 ఎయిర్‌వేస్‌కు చెందినది.

మంగళవారం విమానం బయలుదేరిన తర్వాత రాత్రి 9గంటల 21నిమిషాల సమయంలో ఒక్కసారిగా వేగంగా కిందకు దిగిందని, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు కోల్పోయిందని అధికారులు చెప్పారు.

కరాచీకి పశ్చిమంగా దాదాపు 155 నాటికల్ మైళ్లదూరంలో రాడార్, కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కరాచీ నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం

విమానం కిందకు దిగడానికి కొన్ని నిమిషాల ముందు నావిగేషన్ వ్యవస్థలో సమస్య ఉందని పైలట్లు చెప్పినట్టు తెలిపారు.

పాకిస్తాన్ నౌకాదళం, వైమానిక దళం 12గంటల గాలింపు తర్వాత అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని ఒర్మారా పోర్టు పట్టణానికి 53 నాటికల్ మైళ్ల దూరంలో విమానం శిథిలాలు గుర్తించారు.

విమానం బయలుదేరిన ప్రాంతం కరాచీనుంచి ఒర్మారా 360 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2020లో ప్రయాణికుల విమానానికి ప్రమాదం జరిగిన తర్వాత పాకిస్తాన్‌లో మరో భారీ ప్రమాదం జరిగింది మళ్లీ ఇప్పుడే.

అప్పటి ప్రమాదంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ ఎయిర్‌పోర్టు సమీపిస్తుండగా కూలిపోయి అందులోని 99మంది ప్రయాణికుల్లో ఇద్దరు మినహా మిగిలినవారు చనిపోయారు.

ఇప్పుడు ప్రమాదానికి గురైన విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారని విమానయాన సంస్థ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)